15, అక్టోబర్ 2010, శుక్రవారం

విజయ దశమి

నవ దుర్గా రూపిణి యైన ఆది పరాశక్తి

నవరాత్రులు ముగిసిన తర్వాత విజయదశమి నాటి విశిష్టత:

ఆ జగదంబ తొమ్మిది రోజులు తొమ్మిది అలంకారాలలో మహాకాళీ, మహాలక్ష్మీ, మహాసరస్వతుల రౌద్ర, సౌమ్య రూపాలలో మనలను కరుణించి, ఆశీర్వదిస్తోంది. నవరాత్రుల తదుపరి, శుద్ధ దశమి నాడు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణలో చెడుపై మంచి విజయానికి సంకేతం గా శ్రీ రాజ రాజేశ్వరీ రూపంలో మనకు ఆ విజయవాటిక దుర్గమ్మ కనిపిస్తుంది. ఈ విజయానికి సూచనలు ఎన్నో - రాముడు రావణుని సంహరించటం (దానికి మనము రావణ దహనం చేయటం), పాండవుల  అజ్ఞాతవాసము పూర్తయి కురుక్షేత్ర సంగ్రామ ఘట్టానికి నాంది, మహిషాసుర మర్దనం - అన్నీ ఈ విజయ దశమి రోజునే.  ఉత్తరాదిన రావణ దహనం చాలా కన్నుల పండువగా చేస్తారు. అలాగే వంగ దేశంలో ఈ మహిషాసుర మర్దిని యొక్క దుర్గా పూజా ఉత్సవాలు ముగిసి ప్రజలు ఆనందోత్సాహాల్లో ఉంటారు.



ఈ పండుగ మన దేశంలోనే కాదు, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్‌లో కూడా జరుపుకుంటారు. ఉత్తరాదిన దసరాగా ఈ పండుగకు పేరు. ఇది దశ్ హరా అనే పదాలనుండి వచ్చింది. రావణుని రాముడు సంహరించటానికి సంకేతం ఇది. విజయదశమి దుర్మార్గంపై దైవత్వం యొక్క విజయానికి ప్రతీకగా ఎంతో వేడుకగా జరుపుకునే పండుగ. దసరాతో ముగిసే పదిరోజులలో ఉత్తరాదిన రామాయణ ఘట్టాలను ప్రదర్శిస్తారు. దీనికే రాంలీలా అని పేరు. దశమినాడు రావణుడు, కుంభకర్ణుడు, ఇంద్రజిత్తుల ఎత్తైన బొమ్మలను తయారు చేసి వాటిలో బాణాసంచా పెట్టి కాల్చి సంబరాలు చేసుకుంటారు. దక్షిణాదిన ఈ నవరాత్రులలో బొమ్మల కొలువు పెట్టటం ఆనవాయితీ. ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటకలో ఈ సాంప్రదాయం చాలా ప్రసిద్ధి. రకరకాల బొమ్మలను చక్కగా అలంకరించి నిత్య పూజ చేస్తారు. ఈ సాంప్రదాయాన్ని తమిళనాడు దేవాలయాలలో కూడా చూడవచ్చు. రకరకాల దేవతల బొమ్మలను, గ్రామీణ ప్రాంతపు జీవనాన్ని ప్రతిబింబించేలా ఈ బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తారు. పాడ్యమితో మొదలయ్యే ఈ కొలువు విజయదశమితో ముగుస్తుంది.


తెలంగాణా ప్రాంతంలో నవరాత్రులలో బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. వెదురు సిబ్బిపై పూలను అందంగా వరుసలు పేర్చి గౌరీ పూజ చేసి స్త్రీలు చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతారు. వాయనాలు ఇస్తారు. ఈ బతుకమ్మలను చివరిరోజున చెరువులో వదులుతారు.బెంగాలు, ఒడిషాలలో నవరాత్రులు అత్యంత వైభవంగా జరుపుతారు. గణేష నవరాత్రులలా అమ్మవారి విగ్రహాలను వీధి వీధులలో ఏర్పాటు చేసి నిత్యం పూజ చేసి వాటిని దశమి నాడు నిమజ్జనం చేస్తారు.




గుజరాత్, రాజస్థాన్ ప్రాంతాలలో గర్బా, డాండియా రాస్ ఇక్కడ ప్రజల దసరా ఉత్సవాలలో ప్రత్యేకత. నవరాత్రులలో ప్రజలు చక్కగా అందమైన దుస్తులు ధరించి కోలాటం ఆడుతూ నాట్యం చేస్తారు. గర్బా మన జనన మరణాల చక్రానికి ప్రతీకగా వలయాకారంలో తిరుగుతూ చేయగా డాండియా రాస్ స్త్రీ పురుషుల ఆనందకేళిగా కన్నుల పండువగా ఉంటుంది. దీనికి ప్రత్యేకమైన వస్త్ర ధారణ ఉంటుంది. ఈ ఉత్సవాలు రాత్రిపూట జరుగుతాయి.



ఆంధ్రలో తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామికి బ్రహ్మోత్సవాలు ఈ నవరాత్రులలో జరుగుతాయి. అత్యంత వైభవంగా జరిగే ఈ బ్రహ్మోత్సవాలలో స్వామిని వేర్వేరు వాహనాలపై మాడవీధులలో ఊరేగిస్తారు. విజయదశమినాడు శ్రీదేవీ భూదేవీ సహిత స్వామి వార్ల ఉత్సవమూర్తులకు శ్రీవరాహ స్వామి సన్నిధిలో అవభృథ స్నానం చేయిస్తారు. స్వామి వారి సుదర్శన చక్రానికి పుష్కరిణిలో స్నానం చేయిస్తారు. ఈరోజు కోనేటిలో స్నానం చేస్తే ఆ చక్రస్నానం ఫలాన మన పాపాలన్నీ తొలగుతాయని నమ్మకం. నవరాత్రుల మొదటి రోజున బ్రహ్మోత్సవాల ఆరంభానికి ప్రతీకగా అధిరోహించబడిన గరుడ ధ్వజాన్ని నేడు అవరహోణం చేస్తారు. ఇంతటితో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. 

శ్రీశైలంలో భ్రమరాంబికా సహిత మల్లికార్జున స్వామి దేవస్థనంలో నవరాత్రులలో అమ్మవారు వేర్వేరు నవదుర్గల అలంకారాలలో దర్శనమిస్తుంది. విజయదశమి నాడు చండీహోమము, రుద్రహోమములకు పూర్ణాహుతి చేస్తారు. 

శమీ పూజ:

పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు తాము ఇంద్రాది దేవతల వద్ద తపస్సు చేసి పొందిన ఆయుధాలను మూట గట్టి శమీ వృక్షము మీద ఉంచుతారు. ఈ అజ్ఞాత వాసాము ముగిసేంత వరకు ఈ శమీ వృక్షము వాళ్ల ఆయుధాలను కాపాడి పాండవులకు తప్ప మిగతా ఎవ్వరికీ అవి కనపడకుండా జాగ్రత్తగా కాపాడుతుంది. తమ అజ్ఞాతవాసము ముగియగానే అర్జునాదులు వచ్చి శమీ పూజ చేసి ఆయుధాలను తీసుకొని తిరిగి తమ పూర్వ వైభవము, రాజసము, విజయ లక్ష్మిని పొందుతారు.

శమీ వృక్షము

దీనికి ప్రతీకగా ప్రతియేటా విజయదశమి నాడు భారతీయులు శమీ వృక్షానికి పూజ చేసి, ఈ క్రింది శ్లోకము పఠించి, కాగితము మీద కుటుంబ సభ్యుల గోత్ర నామములు, ఈ శ్లోకము రాసి ఆ వృక్షము వద్ద ఉంచి, పూజించి ఇంటికి తెచ్చుకుంటారు. తెలంగాణా ప్రాంతంలో ఈ చెట్టును జమ్మి అని, ఉత్తరాదిన ఝండ్, తమిళంలో జంబు మారం అని పిలుస్తారు . ఈ శమీ ఆకులను బంగారముగా భావించి అందరికి పంచి తమ సోదర, సంఘీభావాన్ని తెలుపుతారు.

శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనం |
అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శనం ||

సమర్థ సద్గురు సాయినాథుల సమాధి:



కుగ్రామంలో ఉంటూ, మతాలకు, కులాలకు అతీతంగా, యద్భావం తద్భవతి అన్నది గురువు పట్ల ఎలా ఉండాలో, శ్రద్ధ, సాబురీలతో (సంతోషము,నిష్ఠలతో కూడిన ఓరిమి) ఎలా ఆత్మజ్ఞానాన్ని పొంది మోక్ష మార్గులము కాగలమో అతి సామాన్యునికి అర్థం అయ్యేలా జీవించి ఉదాహరణగా నిలిచిన దత్తావతారుడు ఆ సాయినాథుడు.  సిరిసంపదలకు దూరంగా, మనుషులకు వారి వారి వ్యక్తిత్వాలను, పూర్వజన్మ సంస్కారాలను బట్టి ఆధ్యాత్మిక మార్గాలను బోధ చేసిన సద్గురువు సాయినాథుడు. మతవైషమ్యాలతో అట్టుడుకుతున్న దక్కన్ పీఠభూమి మరాఠా ప్రాంతాలలో హిందూ-ముస్లిం ప్రజల ఐక్యతకు ప్రతీక సాయినాథుడు. ఎన్నో లీలలను, అద్భుతాలను చేసిన అవతార పురుషుడు సాయినాథుడు. 1918 సంవత్సరములో విజయదశమి నాడు సమర్థ సద్గురు సాయి బాబా షిర్డీ గ్రామంలో సమాధి చెందారు. అక్కడ ఎంతో వైభవంగా ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఈ రోజు సాయినాథుని సచ్చరిత్ర పారాయణకు చాలా విశేషమైన రోజు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.

ఇలా విజయదశమి భారత దేశంలో ఎంతో ప్రాశస్త్యమున్న పండుగ. ప్రజలు ఎంతో వేడుకగా, భక్తి శ్రద్ధలతో జరుపుకునేపండుగ. పండుగలు ప్రజలను ఆఇకమత్యంతో ఉంచటంతో పాటు వారిలో భగవద్భక్తి, ఆనందానురాగాలు నింపుతాయి. అదే మన సనాతనధర్మం యొక్క గొప్పతనం. 

14, అక్టోబర్ 2010, గురువారం

మహిషాసుర మర్దిని

శరన్నవరాత్రుల తొమ్మిదవ నాడు (మహా నవమి), నవ రాత్రులలో ఆఖరి రోజు -   బెజవాడ దుర్గమ్మ మహిషాసుర మర్దిని రూపంలో కనిపిస్తుంది. దుష్ట శిక్షణకు త్రిమూర్తుల శక్తితో సహస్ర బాహువులతో, సకల ఆయుధాలతో, రౌద్ర రూపం దాల్చి మహిషాసురుణ్ణి చంపిన ఆ జగజ్జనని జగద్రక్షకియై వెలసిల్లింది. ఆదిశంకరులు రచించిన మహిషాసురమర్దిని స్తోత్రం మీకోసం. శ్రవణం యూట్యూబ్ లంకెలో


అయి గిరినందిని నందితమేదిని విశ్వవినోదిని నందనుతే
గిరివర వింధ్య శిరోధినివాసిని విష్ణువిలాసిని జిష్ణునుతే
భగవతి హే శితికంఠకుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

సురవరవర్షిణి దుర్ధరధర్షిణి దుర్ముఖమర్షిణి హర్షరతే
త్రిభువనపోషిణి శంకరతోషిణి కిల్బిషమోషిణి ఘోషరతే
దనుజ నిరోషిణి దితిసుత రోషిణి దుర్మద శోషిణి సింధుసుతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

అయి జగదంబ మదంబ కదంబ వనప్రియ వాసిని హాసరతే
శిఖరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ మధ్యగతే
మధు మధురే మధు కైటభ భంజిని కైటభ భంజిని రాసరతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

అయి శతఖండ విఖండిత రుండ వితుండిత శుండ గజాధిపతే
రిపు గజ గండ విదారణ చండ పరాక్రమ శుండ మృగాధిపతే
నిజ భుజ దండ నిపాతిత ఖండ విపాతిత ముండ భటాధిపతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

అయి రణ దుర్మద శత్రు వధోదిత దుర్ధర నిర్జర శక్తిభృతే
చతుర విచార ధురీణ మహాశివ దూతకృత ప్రమథాధిపతే
దురిత దురీహ దురాశయ దుర్మతి దానవదూత కృతాంతమతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

అయి శరణాగత వైరి వధూవర వీర వరాభయ దాయకరే
త్రిభువన మస్తక శూల విరోధి శిరోధి కృతామల శూలకరే
దుమిదుమి తామర దుందుభినాద మహో ముఖరీకృత తిగ్మకరే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

అయి నిజ హుంకృతి మాత్ర నిరాకృత ధూమ్ర విలోచన ధూమ్ర శతే
సమర విశోషిత శోణిత బీజ సముద్భవ శోణిత బీజ లతే
శివ శివ శుంభ నిశుంభ మహాహవ తర్పిత భూత పిశాచరతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

ధనురను సంగ రణక్షణసంగ పరిస్ఫుర దంగ నటత్కటకే
కనక పిశంగ పృషత్క నిషంగ రసద్భట శృంగ హతావటుకే
కృత చతురంగ బలక్షితి రంగ ఘటద్బహురంగ రటద్బటుకే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

జయ జయ జప్య జయేజయ శబ్ద పరస్తుతి తత్పర విశ్వనుతే
ఝణ ఝణ ఝింజిమి ఝింకృత నూపుర సింజిత మోహిత భూతపతే
నటిత నటార్ధ నటీనట నాయక నాటిత నాట్య సుగానరతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

అయి సుమనః సుమనః సుమనః సుమనః సుమనోహర కాంతియుతే
శ్రిత రజనీ రజనీ రజనీ రజనీ రజనీకర వక్త్రవృతే
సునయన విభ్రమర భ్రమర భ్రమర భ్రమర భ్రమరాధిపతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

సహిత మహాహవ మల్లమ తల్లిక మల్లిత రల్లక మల్లరతే
విరచిత వల్లిక పల్లిక మల్లిక ఝిల్లిక భిల్లిక వర్గ వృతే
సితకృత పుల్లసముల్ల సితారుణ తల్లజ పల్లవ సల్లలితే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

అవిరళ గండ గళన్మద మేదుర మత్త మతంగజ రాజపతే
త్రిభువన భూషణ భూత కళానిధి రూప పయోనిధి రాజసుతే
అయి సుద తీజన లాలసమానస మోహన మన్మథ రాజసుతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

కమల దళామల కోమల కాంతి కళాకలితామల భాలలతే
సకల విలాస కళానిలయక్రమ కేళి చలత్కల హంస కులే
అలికుల సంకుల కువలయ మండల మౌళిమిలద్భకులాలి కులే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

కర మురళీ రవ వీజిత కూజిత లజ్జిత కోకిల మంజుమతే
మిళిత పుళింద మనోహర గుంజిత రంజితశైల నికుంజగతే
నిజగుణ భూత మహాశబరీగణ సద్గుణ సంభృత కేలితలే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

కటితట పీత దుకూల విచిత్ర మయూఖతిరస్కృత చంద్ర రుచే
ప్రణత సురాసుర మౌలిమణిస్ఫుర దంశుల సన్నఖ చంద్ర రుచే
జిత కనకాచల మౌళిపదోర్జిత నిర్భర కుంజర కుంభకుచే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

విజిత సహస్రకరైక సహస్రకరైక సహస్రకరైకనుతే
కృత సురతారక సంగరతారక సంగరతారక సూనుసుతే
సురథ సమాధి సమానసమాధి సమాధిసమాధి సుజాతరతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

పదకమలం కరుణానిలయే వరివస్యతి యోనుదినం స శివే
అయి కమలే కమలానిలయే కమలానిలయః స కథం న భవేత్
తవ పదమేవ పరంపదమిత్యనుశీలయతో మమ కిం న శివే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

కనకలసత్కల సింధు జలైరను సించినుతేగుణ రంగభువం
భజతి స కిం న శచీకుచ కుంభ తటీ పరిరంభ సుఖానుభవమ్
తవ చరణం శరణం కరవాణి నతామరవాణి నివాసి శివం
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

తవ విమలేందుకులం వదనేందుమలం సకలం నను కూలయతే
కిము పురుహూత పురీందుముఖీ సుముఖీభిరసౌ విముఖీక్రియతే
మమ తు మతం శివనామధనే భవతీ కృపయా కిముత క్రియతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

అయి మయి దీనదయాలుతయా కృపయైవ త్వయా భవితవ్యముమే
అయి జగతో జననీ కృపయాసి యథాసి తథానుమితాసిరతే
యదుచితమత్ర భవత్యురరీ కురుతాదురుతాపమపాకురుతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

దుర్గా సూక్తం, తాత్పర్యము

శరన్నవరాత్రుల ఎనిమిదవ నాడు (అష్టమి) ఆ అది పరాశక్తి దుర్గ గా అలంకరించబడుతుంది. ఈ రోజునే దుర్గాష్టమిగా మనము జరుపుకుంటాము. ఋగ్వేదంలో అనేక చోట్ల కనబడే స్తుతులను తైత్తిరీయ అరణ్యకంలో సంకలనం చేయబడి దుర్గా సూక్తం పేరుతో ఈ మహిమాన్విత శ్లోకాలు ప్రచారంలో ఉన్నాయి. జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులను ఈ సూక్త పారాయణము వలన  అధిగమించ వచ్చని విశ్వాసం. దుర్గా సూక్తం అని పేరు వచ్చినా, ఈ స్తుతిలో ఎక్కువ అగ్నిదేవుని స్తుతించేవి గా ఉన్నాయి.  యూట్యూబ్ లంకె.


ఓం జాతవేదసే సునవామ సోమ మరాతీయతే నిదహాతి వేదః |
స నః పర్‍షదతి దుర్గాణి విశ్వా నావేవ సింధుం దురితాత్యగ్నిః || ౧||
తామగ్నివర్ణాం తపసా జ్వలన్తీం వైరోచనీం
కర్మఫలేషు జుష్టామ్ | దుర్గాం దేవిగ్ం శరణమహం
ప్రపద్యే సుతరసి తరసే నమః || ౨||
అగ్నే త్వం పారయా నవ్యో అస్మాంథ్స్వస్తిభిరతి దుర్గాణి విశ్వా |
పూశ్చ పృథ్వీ బహులా న ఉర్వీ భవా తోకాయ తనయాయ శంయోః || ౩||
విశ్వాని నో దుర్గహా జాతవేదః సింధున్న నావా దురితాతిపర్‍షి |
అగ్నే అత్రివన్మనసా గృణానోస్మాకం బోధ్యవితా తనూనామ్ || ౪||
పృతనా  జితగ్ం సహమానముగ్రమగ్నిగ్ం  హువేమ పరమాథ్సధస్థాత్ |
స నః పర్‍షదతి దుర్గాణి విశ్వా క్షామద్దేవో అతి దురితాత్యగ్నిః || ౫||
ప్రత్నోషి కమీడ్యో అధ్వరేషు సనాచ్చ హోతా నవ్యశ్చ సత్సి |
స్వాంచాగ్నే తనువం పిప్రయస్వాస్మభ్యం చ సౌభగమాయజస్వ || ౬||
గోభిర్జుష్టమయుజో నిషిక్తం తవేంద్ర విష్ణోరనుసంచరేమ |
నాకస్య పృష్ఠమభి సంవసానో వైష్ణవీం లోక ఇహ మాదయంతాం || ౭||
ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి | తన్నో దుర్గిః ప్రచోదయాత్ ||

|| ఇతి దుర్గా సూక్తమ్ ||



తాత్పర్యము:

అగ్నిదేవా!  సోమాన్ని పిండి రసాన్ని నీకు సమర్పిస్తాము. జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను అగ్ని దేవుడు దగ్ధము చేయు గాక! పడవ ద్వారా సముద్రము దాటే విధంగా మమ్మల్ని సమస్త బాధలనుండి, తప్పులనుండి అగ్నిదేవుడు కాపాడు గాక!

అగ్నివర్ణం కలదీ, తపస్సు ద్వారా ప్రకాశించునదీ, భగవంతునికి చెందినదీ, కర్మ యొక్క ప్రతిఫలాలలో శక్తిగా నెలకొన్నదీ అయిన దుర్గాదేవిని నేను శరణు జొచ్చుచున్నాను. దుఃఖసాగరం నుండి మమ్మలను తీరానికి చేర్చే దేవీ! మమ్ము కాపాడు. నీకు నమస్కారము. 

ఓ అగ్నిదేవా! నీవు కీర్తింప తగినవాడవు. సంతోషకర మార్గాల ద్వారా మమ్మ్ములను సమస్త దుఃఖాలనుండి దూరంగా తీసుకెళ్ళు, మా ఊరు, దేశము, ప్రపంచము, సుభిక్షముగా ఉండు గాక! మా పిల్లలకు, వారి పిల్లలకు సంతోషాన్ని ఇచ్చే వాడిగా నువ్వు ఉంటావు గాక!

అగ్నిదేవా! సమస్త దుఃఖాలను హరించేవాడా! సముద్రంలో పడి తల్లడిల్లే వ్యక్తిని పడవ కాపాడిన రీతిలో ఈ దుఃఖాల బారినుండి మమ్ము రక్షించు. మా శరీరాలను కాపాడే వాడా! 'యావన్మందీ సంతోషంగా ఉండుగాక' అంటూ మనసులో పదే పదే  చెపుతున్న అత్రి మహర్షిలా మా శ్రేయస్సు మనస్సునందు జ్ఞప్తి యందు ఉంచుకో. 

శత్రు సైన్యాన్ని ముట్టడించేవాడు, వాటిని నాశనం చేసే వాడు, ఉగ్రమైన వాడు అయిన అగ్ని దేవుడుని సభయొక్క అత్యున్నత స్థానం నుండి ఇక్కడకు వేంచేయమని ఆహ్వానిస్తున్నాము. ఆయన మమ్ములను సమస్త క్లేశాలకు, నశించేవాటికి, తప్పిదాల ఆవలకు తీసుకు వెళ్ళు గాక! మమ్ము కాపాడు గాక!

అగ్నిదేవా! యాగాలలో కీర్తించబడుతున్న నువ్వు మా ఆనందాన్ని ఇనుమడింప చేస్తున్నావు. యాగం చేసే వారిలో సనాతనుడిగాను, కొత్త వాడి గాను నువ్వు వెలుగుతున్నావు. నీ రూపంగా ఉంటున్న మాకు సంతోషం ప్రసాదించాలి. మాకు సర్వతోముఖ శ్రేయస్సు తీసుకురావాలి. 

భగవంతుడా! నీవు పాపము అంటని వాడవు, సకలవ్యాపివి. అసంఖ్యాకమైన పశువులతో కూడిన సంపదను పొంద పరమానందము అనుభవింప మేము నిన్ను వెన్నంటుతాము. విష్ణు స్వరూపమైన దుర్గా దేవీ పట్ల మాకున్న భక్తి వలన ఉన్నత దేవలోకంలో నివసించే దేవతలు ఈ ప్రపంచంలో నాకు సంతోషాన్ని ప్రసాదించు గాక! 

కాత్యాయనీ దేవిని తెలుసుకుందాము. దాని కోసం ఆ కన్యకుమారి యైన దుర్గాదేవిని ధ్యానిద్దాం. ఆ దుర్గాదేవి మనకు ప్రేరణ నిచ్చుగాక!

13, అక్టోబర్ 2010, బుధవారం

శ్రీ సూక్తం, తాత్పర్యము

దేవీనవరాత్రులలో ఏడవ రోజు (సప్తమి) అమ్మ వారు మహాలక్ష్మి అలంకరణలో దర్శనమిస్తుంది. వేదాలలో, పురాణాలలో ఉన్న మహాలక్ష్మీ స్తుతుల కూర్పే శ్రీ సూక్తం. మన దక్షిణ భారత పూజా విధానంలో ఇది బహుళ ప్రాచుర్యం సంతరించుకున్నది. ఆ శ్రీమహాలక్ష్మి యొక్క కృపాకటాక్షాలు పరిపూర్ణంగా కలగటానికి దీని పారాయణ శ్రద్ధగా చేద్దాము. శ్రవణం చేయటానికి  యూట్యూబ్ లంకె.




హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజామ్
చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ

తాం మ ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీమ్
యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహమ్

అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాదప్రభోదినీమ్
శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీర్జుషతామ్

కాం సోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాం జ్వలన్తీం తృప్తాం తర్పయన్తీమ్
పద్మేస్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియమ్

చన్ద్రాం ప్రభాసాం యశసా జ్వలన్తీం శ్రియం లోకే దేవజుష్టాముదారామ్
తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే

ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోథ బిల్వః
తస్య ఫలాని తపసా నుదన్తు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీః

ఉపైతు మాం దేవసఖః కీర్తిశ్చ మణినా సహ
ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిమృద్ధిం దదాతు మే

క్షుత్పిపాసామలాం జ్యేష్ఠామలక్ష్మీం నాశయామ్యహమ్
అభూతిమసమృద్ధిం చ సర్వాం నిర్ణుదమే గృహాత్

గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీమ్
  ఈశ్వరీగ్ం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియమ్

మనసః కామమాకూతిం వాచః సత్యమశీమహి
పశూనాం రూపమన్నస్య మయి శ్రీః శ్రయతాం యశః

కర్దమేన ప్రజాభూతా మయి సంభవ కర్దమ
శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీమ్

ఆపః సృజంతు స్నిగ్ధాని చిక్లీతవసమే గృహే
ని చ దేవీం మాతరం శ్రియం వాసయ మే కులే

ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం పింగళాం పద్మమాలినీమ్
చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ

ఆర్ద్రాం యఃకరిణీం యష్టిం  సువర్ణాం హేమమాలినీమ్
సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ

తాం మ ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీమ్
యస్యాం హిరణ్యం ప్రభూతం గావోదాస్యోశ్వాన్ విందేయం పురుషానహమ్

యః శుచిః ప్రయతో భూత్వా జుహుయాదాజ్యమన్వహమ్
శ్రియః పంచదశర్చం చ శ్రీకామః సతతం జపేత్

ఆనందః కర్దమశ్చైవ చిక్లీత ఇతి విశ్రుతాః
ఋషయస్తే త్రయః ప్రోక్తాస్వయాం శ్రీరేవ దేవతా

పద్మాననే పద్మ ఊరూ పద్మాక్షీ పద్మసంభవే
త్వం మాం భజస్వ పద్మాక్షీ యేన సౌఖ్యం లభామ్యహమ్

అశ్వదాయీ గోదాయీ ధనదాయీ మహాధనే
ధనం మే జుషతాం దేవి సర్వకామాంశ్చ దేహి మే

పుత్రపౌత్రం ధనం ధాన్యం హస్త్యశ్వాదిగవేరథమ్
ప్రజానాం భవసి మాతా ఆయుష్మంతం కరోతు మామ్

ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యో ధనం వసుః
ధనమింద్రో బృహస్పతిర్వరుణం ధనమశ్ను తే

చంద్రాభాం లక్ష్మిమీశానాం సూర్యాభాం శ్రియమీశ్వరీం
చంద్రసూర్యాగ్ని వర్ణాభాం శ్రీమహాలక్ష్మీముపాస్మహే

వైనతేయ సోమం పిబ సోమం పిబతు వృత్రహా
సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమినః

న క్రోధో న చ మాత్సర్యం న లోభో నాశుభా మతిః
భవంతి కృతపుణ్యానాం భక్తానాం శ్రీసూక్తం జపేత్సదా

వర్షంతు తే విభావరి దివో అభ్రస్య విద్యుతః
రోహంతు సర్వబీజాన్యవ బ్రహ్మ ద్విషో జహి

పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదలాయతాక్షి
విశ్వప్రియే విష్ణు మనోనుకూలే త్వత్పాదపద్మం మయి సన్నిధత్స్వ

యా సా పద్మాసనస్థా విపులకటితటీ పద్మపత్రాయతాక్షీ
గంభీరావర్తనాభిః స్తనభర నమితా శుభ్ర వస్త్రోత్తరీయా
లక్ష్మీర్దివ్యైర్గజేంద్రైమణిగణ ఖచితైస్స్నాపితా హేమకుంభైః
నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వమాంగల్యయుక్తా

లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం
దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం
శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్రగంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియామ్

సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీస్సరస్వతీ
శ్రీలక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా

వరాంకుశౌ పాశమభీతిముద్రాం కరైర్వహంతీం కమలాసనస్థాం
బాలార్క కోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహమాద్యాం జగదీశ్వరీం త్వామ్

సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే

సరసిజ నిలయే సరోజహస్తే ధవళతరాంశుక గంధమాల్యశోభే
భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతికరి ప్రసీదమహ్యమ్

ఓం విష్ణుపత్నీం క్షమాం దేవీం మాధవీం మాధవప్రియాం
విష్ణోః ప్రియసఖీం దేవీం నమామ్యచ్యుతవల్లభామ్

ఓం మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి
తన్నో లక్ష్మీః ప్రచోదయాత్

శ్రీవర్చస్యమాయుష్యమారోగ్యమావిధాత్ పవమానం మహీయతే
ధనం ధాన్యం పశుం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః
ఋణరోగాది దారిద్ర్య పాపంక్షుదపమృత్యవః
భయశోకమనస్తాపా నశ్యంతు మమ సర్వదా

శ్రియే జాత శ్రియ ఆనిర్యాయ శ్రియం వయో జరితృభ్యో దధాతు
శ్రియం వసానా అమృతత్వమాయన్ భజంతి సద్యః సవితా విదధ్యూన్

శ్రియ ఏవైనం తచ్ఛ్రియామాదధాతి
సంతతమృచావషట్ కృత్యం సంధత్తం సంధీయతే ప్రజయా పశుభిః
య ఏవం వేద

ఓం మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి
తన్నో లక్ష్మీః ప్రచోదయాత్

ఓం శాంతిః శాంతిః శాంతిః





తాత్పర్యము:

ఓ అగ్నిదేవా! బంగారు మేని ఛాయ గల, పాపాలను  నాశనము చేసే, బంగారు మరియు వెండి ఆభరణాలతో అలంకరించబడిన, చంద్రుని వలె చల్లగా ఆహ్లాదకరంగా, సువర్ణమయమైన యున్న మహాలక్ష్మిని నా కొరకు ఆవాహన చేయుము. 

ఎవరి కరుణ,  కటాక్షములతో నాకు బంగారము, ఆవులు, గుర్రాలు, బంధువులు సంప్రాప్తమైనవో ఆ మహాలక్ష్మిని నా వద్దకు ఆవాహనము చేయుము. ఆమె నా వద్ద నుండి వీడిపోకుండా చూడుము. 

గుర్రాలతో ఉన్న రథం మధ్యలో ఆసీనమైనది, తన రాకను ఏనుగు ఘీంకార నాదంతో సూచిస్తున్న ఆ శ్రీదేవిని ఆహ్వానిస్తున్నాను. తల్లీ నీవు నా వద్ద సంతోషముగా నెలకొని ఉండుము. 

చక్కని చిరునవ్వుతో, బంగారు కోటలో నివసించే, కరుణ, తేజస్సు, ఆనంద రూపిణియై, ఆనందము ప్రసాదించునది, పద్మములో ఆసీనురాలై, పద్మము వంటి ఛాయకలది అయిన ఆ శ్రీదేవిని ఇక్కడ సాక్షాత్కరించమని ప్రార్థిస్తున్నాను. 

చంద్రుని పోలినది, తేజోవంతమైనది, తన కీర్తి చంద్రికలతో ప్రకాశించుచున్నది, దేవతలచే పూజిన్చబడుచున్నది, కరుణా స్వరూపిణి, పద్మమును ధరించినది, 'ఈం' అనే బీజమంత్రానికి భావంగా ఉన్నది అయిన మహాలక్ష్మిని నేను శరణు వేడుతున్నాను. ఓ దేవీ! నిన్ను ప్రార్థిస్తున్నాను, నా దారిద్ర్యం పోయేలా కరుణించు. 

సూర్యుని తేజస్సు కలిగిన ఓ తల్లి! వనానికి అధిపతియైన బిల్వవృక్షం (మారేడు చెట్టు) నీ తపోమహిమచే ఉద్భవించినది. నీ తపస్సు వలన కలిగిన దాని ఫలాలు అజ్ఞానము మనే లోని ఆటంకాన్ని, అమంగళకరమైన బయటి ఆటంకాన్ని తొలగిస్తాయి గాక!  

కుబేరుడు, కీర్తి ఐశ్వర్యాలతో నన్ను వెన్నంటి రావాలి. నీ అనుగ్రహం పూర్తిగా నిండిన ఈ దేశంలో నేను జన్మించాను. సకల సంపదలను నాకు ప్రసాదించు! 

ఆకలి దప్పికలతో కృశించినది, శ్రీదేవి కంటే ముందుగా జన్మించిన జ్యేష్టాదేవిని  (అలక్ష్మి) నేను నాశనం చేస్తాను. నా గృహము నుండి అభాగ్యము, కొరతలను పూర్తిగా నిర్మూలించి నన్ను అనుగ్రహించు. 

సుగంధానికి నిలయమైనది, జయింప అలవికానిది, ఎల్లప్పుడూ పుష్టినిచ్చేది, సకల సంపదలు కలిగిన, సమస్త జీవులకు అధినాయిక యైన మహాలక్ష్మిని ఇక్కడ ఆవాహన చేస్తున్నాను. 

ఓ శ్రీదేవి! మనస్సులో జనించే ఉత్తమమైన కోరికలూ, సంతోషము, వాక్కులో సత్యము, గోసంపద చే, ఆహార సమృద్ధిచే కలిగే ఆనందాన్ని నేను చవి చూడాలి. నాకు కీర్తి కలుగచేయుము. 

కర్దమ మహర్షి! నీకు పుత్రికగా జన్మించిన మహాలక్ష్మి నాకు సాక్షాత్కారించాలి. తామరపువ్వుల మాల ధరించిన, సిరిసంపదలకు అధిదేవత, తల్లి అయిన ఆమెను నా కులములో ఎల్లప్పుడూ నివసింప చేయాలి.  

మహాలక్ష్మి పుత్రుడవైన ఓ చిక్లీత! నీరు, చక్కని ఆహారపదార్థాలను ఉత్పత్తి చేయుగాక! నా ఇంట నీవు నివసించాలి.  దేవీ, నీ మాత అయిన ఆ మహాలక్ష్మి నా కులములో నిరంతరమూ నివసించేలా అనుగ్రహించు. 

ఓ అగ్నిదేవ! కరుణ కలిగిన మనసు కలది, పద్మవాసిని, లోకానికి ఆహారము ఇచ్చి పోషించేది, కుంకుమ రంగు కలది, తామరపువ్వుల మాల ధరించినది, చంద్రునివలె ఆహ్లాదకరమైనది, బంగారుమయమైనది అయిన మహాలక్ష్మిని నా కొరకు ఆవాహన చేయుము. 

అగ్నిదేవా! దయకలిగినది, గంభీరముగా యుండెడిది, దండము చేత బూనినది, అందమైన శరీరచాయ కలిగినది, సూర్యునివలె ప్రకాశించునది, బంగారుమయమైనది అయిన మహాలక్ష్మిని నా కొరకు ఆవాహన చేయుము. 

అగ్నిదేవా! ఎవరి వలన నేను అంతులేని బంగారుము, గోవులు, సేవకులు, గుర్రాలు ప్రాప్తించుకుంటానో , అట్టి మహాలక్ష్మిని నన్ను వదలి వెళ్లిపోకుండా కృప చూపుము. 

ఎవరు లక్ష్మీదేవి కృప కొరకు ప్రార్తిస్తున్నారో, వారు ఇంద్రియాలు నిగ్రహించి, ప్రతిరోజూ ఆజ్యముతో హోమము చేయాలి. పైన తెలిపిన పదిహేను మంత్రాలను సదా జపిస్తూ ఉండాలి. సుప్రసిద్ధులు, ఋషులు అయిన ఆనందుడు, కర్దముడు, చిక్లీతుడు ముగ్గురు ఈ సూక్తంలోని ఋషులు, మహాలక్ష్మియే దేవత.

పద్మము వంటి ముఖము, ఊరువులు, కన్నులు కలదానా! పద్మము నుండి ఉద్భవించిన తల్లి!, నేను దేని వలన సుఖాన్ని పొందుతానో దాన్ని ప్రసాదించు.

గుర్రాలను, గోవులను, సంపదలను ఇచ్చే, ధనానికి అధిదేవతయైన మహాలక్ష్మి! కోరికలన్నీ నెరవేరేటప్పుడు కలిగే సుఖాన్ని ఇచ్చే సంపదను నాకు ప్రసాదించు. 

పుత్రులు, గోవులు, ధనధాన్యాలు, ఏనుగులు, గుర్రాలు, రథాలు మొదలైన సకల సంపదలు ప్రసాదించు. జనులకు నువ్వు తల్లిగా భాసిస్తున్నావు. నన్ను ఆయుష్మంతునిగా చేయుము. 

అగ్ని, వాయువు, సూర్యుడు, అష్టవసువులు, దేవేంద్రుడు, బృహస్పతి, వరుణుడు - తమ తమ సంపదలను నీ కృపతో అనుభవిస్తున్నారు.

చంద్రునివలె చల్లగా, దేవతల శక్తిగా, సూర్యుని తేజస్సుతో ప్రకాశిస్తున్నది, శ్రీదేవి, ఈశ్వరి, చంద్రుడు, సూర్యుడు, అగ్ని - మువ్వురినీ తన మహత్తుగా కలదీ అయిన శ్రీమహాలక్ష్మిని కొలుస్తున్నాను. 
ఓ గరుత్మంతుడా! సోమరసం కోసం వచ్చిన వృత్రాసురుని సంహరించిన ఇంద్రుడు సోమరసం గ్రోలనీ. సోమయాగం నిర్వర్తించాలని సంకల్పించిన నాకు పుష్కలముగా ధనాన్ని ప్రసాదించనీ!

పుణ్యము చేసిన భక్తులకు కోపము రాదు, మాత్సర్యము ఉండదు, లోభము నశిస్తుంది, దుర్బుద్ధి పుట్టదు. భక్తిని పొంద కోరేవారు శ్రీ సూక్తాన్ని సదా జపము చెయ్యాలి. 

నీ కృపతో మేఘాలు ఎల్లప్పుడూ వర్షించనీ! విత్తనాలు చక్కగా మొలకెత్తి బాగా పెరగనీ! భగవంతుని నిందించేవారు నిష్క్రమించు గాక! 

పద్మము అంటే ఇష్టపడేదానా! పద్మములు చేతిలో ధరించిన జగన్మాతా! పద్మములో జన్మించి, నివసించే తల్లీ! తామర రేకులవంటి విశాలమైన కన్నులు కలిగి, విష్ణువు మనస్సుకు అనుకూలమైన మాతా! నీ పాదపద్మములతో నన్ను అనుగ్రహించు. 

పద్మము మీద ఆసీనురాలై ఉన్నదేవరో, విస్తారమైన పిరుదులు కలిగిన, తామర రేకులవంటి నేత్రములు కలవారెవరో, లోతైన నాభి కలిగి, స్తన భారముతో వంగి ఉన్న వారెవరో, స్వచ్చమైన వస్త్రాలు, ఉత్తరీయము ధరించిన దెవరో, రత్నాలు పొదిగిన కలశాల జలంతో దేవలోకములోని అత్యుత్తమైన గజములతో అభిషేకించ బడుతున్న దెవరో, పద్మాన్ని చేత ధరించిన దెవరో,  సర్వ మంగళ స్వరూపిణియైన దెవరో అట్టి మహాలక్ష్మి నా గృహములో సదా సర్వవేళలా నివసించుగాక! 

భాగ్యానికి నిలయమైనది, పాలకడలి నుండి ఉద్భవించినది, శ్రీరంగములో వెలసిన దేవీ, దేవ లోక స్త్రీల నందరిని దాసీజనంగా చేసుకొన్నది, లోకాని దీపంగా భాసిస్తున్నది, ఎవరి మృదుల కటాక్షంతో ఇంద్రుడు, శివుడు వైభవము పొందుతున్నారో, మూడు లోకాలను తన కుటుంబముగా చేసుకున్నది, తామర కొలనులో ఉద్భవించినది, మహావిష్ణువుకు ప్రియమైనది అయిన నీకు నమస్కరిస్తున్నాను. 

సిద్ధులను ఇచ్చే, ముక్తిని అనుగ్రహించే, విజయాన్ని సిద్ధింప చేసే లక్ష్మీ రూపాలలో, సరస్వతిగాను, సంపదలిచ్చే శ్రీదేవిగాను, వరాలిచ్చే వరలక్ష్మిగా నువ్వు సదా నాకు ప్రసన్నురాలవుగా ఉండుగాక! 

వర, అభయ ముద్రలు చేత దాల్చిన, పాశము, అంకుశములు చేత ధరించిన, పద్మములో నివసిస్తున్న, కోటి బాల సూర్యుల ప్రకాశము కలదీ, మూడు నేత్రములు కలదీ, ఆదిశక్తి, జగదీశ్వరి అయిన ఆమెను నేను స్తుతిస్తాను. 

శుభములలో శుభానివి, సకల శుభాలను సాధించి, ప్రసాదించే దానవు, శరణు పొందటానికి యుక్తమైన దానవు, మూడు కన్నులు కాలిగిన ఓ దేవీ, నారాయణీ! నా నమస్కారము. 

పద్మ వాసిని, పద్మమును చేత ధరించినది, పవిత్రమైన తెల్లని వస్త్రములు, సుగంధభరితమైన మాలను ధరించి శోభిస్తున్న, భగవతి, హరిపత్ని, కామ్యదాయిని, ముల్లోకాలను పోషించి కాపాడే నువ్వు నన్ను అనుగ్రహించు. 

విష్ణుపతిని, భూదేవి, తులసి గా అలరారుతున్నది, మాధవుని ప్రియురాలు, ప్రియసఖి, విష్ణువుతో కూడిన దేవీ! నేను నమస్కరిస్తున్నాను. 

మహాలక్ష్మిని తెలుసుకుందాము. విష్ణుపత్నియైన  ఆమెను అందుకై ధ్యానిద్దాం. ఆ లక్ష్మీదేవి మనకు ప్రేరణనిచ్చు గాక!

మహాలక్ష్మీ! వర్చస్సు, లోటు లేని జీవితం, మంచి ఆరోగ్యం - నాకు ప్రసాదించే పవనాలు సదా వీచనీ. ధన ధాన్యాలు, పశు సంపద, పుత్రులు, నూరేళ్ళ దీర్ఘాయుష్షు నాకు చేకూరనీ. ఋణము, రోగము, దారిద్ర్యము, ఆకలి, అకాల మరణము, భయము, శోకము, మానసిక వ్యథలు నశించు గాక!.

శ్రీదేవి చేరే వారిని ఐశ్వర్యం వరిస్తుంది; సంపద, దీర్ఘాయుష్షు చేకూరుతుంది. వారు ఐశ్వర్యాలతో తులతూగుతూ మరణం లేని స్థితికి చేరుకుంటారు. సత్వరమే వారు కీర్తిని, విజయాన్ని పొందుతారు. 

మంచివి అన్నీ లక్ష్మే దేవియే - ఇలా తెలుసుకున్న వాడు లక్ష్మీ దేవిని చేరుకుంటాడు. మంత్రయుక్తముగా ఎల్లప్పుడూ యాగము చేయాలి. అలా చేసే వాడికి పుత్ర సంపద, పశు సంపద లభిస్తుందని గ్రహించాలి.

మహాలక్ష్మిని తెలుసుకుందాము. విష్ణుపత్నియైన  ఆమెను అందుకై ధ్యానిద్దాం. ఆ లక్ష్మీదేవి మనకు ప్రేరణనిచ్చు గాక!

12, అక్టోబర్ 2010, మంగళవారం

శారదా భుజంగం మరియు సరస్వతీ స్తోత్రం

శారదాభుజఙ్గప్రయాతాష్టకమ్‌

శరన్నవరాత్రుల ఆరవ రోజు సరస్వతి అలంకారంలో కనిపించే ఆ జగన్మాత శృంగేరి క్షేత్రంలో శారదాంబగా వెలసింది. ఆదిశంకరులు స్థాపించిన ఈ శక్తి క్షేత్రం కర్ణాటకలోని పశ్చిమ కనుముల మధ్య ఋష్యశృంగ పర్వత సమూహం మధ్య తుంగా నదీ తీరాన అత్యంత రమణీయమైన శృంగేరి గ్రామంలో ఉంది. పచ్చని ప్రకృతి, ఉత్తుంగ తరంగమై ప్రవహించే తుంగానది, నదికి ఒక పక్క అమ్మవారి, విద్యాశంకరుల దేవాలయాలు, మరొకపక్క శంకరాచార్యుల సంస్థానం, నిత్యాన్నదానం, భూతల కైలాసంలా ఉంటుంది ఈ క్షేత్రం. అందుకేనేమో ఆదిశంకరులు ఇక్కడ ఆ చదువులతల్లి పీఠాన్ని స్థాపించారు. ఆయన ఆ శారదా దేవిని స్తుతిస్తూ రచించిన శారదాభుజఙ్గప్రయాతాష్టకమ్‌. యూట్యూబ్ లంకె.


శృంగేరి శారదాంబ
సువక్షోజకుమ్భాం సుధాపూర్ణకుంభాం
ప్రసాదావలమ్బాం ప్రపుణ్యావలంబాం
సదాస్యేన్దుబిమ్బాం సదానోష్ఠబింబాం
భజే శారదామ్బామజస్రం మదంబాం   ౧
కటాక్షే దయార్ద్రాం కరే జ్ఞానముద్రాం
కలాభిర్వినిద్రాం కలాపైః సుభద్రామ్‌
పురస్త్రీం వినిద్రాం పురస్తుఙ్గభద్రాం
భజే శారదామ్బామజస్రం
మదంబాం
లలామాఙ్కఫాలాం లసద్గానలోలాం
స్వభక్తైకపాలాం యశఃశ్రీకపోలామ్‌
కరే త్వక్షమాలాం కనత్ప్రత్నలోలాం
భజే శారదామ్బామజస్రం
మదంబాం
సుసీమన్తవేణీం దృశా నిర్జితైణీం
రమత్కీరవాణీం నమద్వజ్రపాణీమ్‌
సుధామన్థరాస్యాం ముదా చిన్త్యవేణీం
భజే శారదామ్బామజస్రం
మదంబాం ‌ ౪
సుశాన్తాం సుదేహాం దృగన్తే కచాన్తాం
లసత్సల్లతాఙ్గీమనన్తామచిన్త్యామ్‌
స్మృతాం తాపసైః సర్గపూర్వస్థితాం తాం
భజే శారదామ్బామజస్రం
మదంబాం
కురఙ్గే తురఙ్గే మృగేన్ద్రే ఖగేన్ద్రే
మరాలే మదేభే మహోక్షేధిరూఢామ్‌
మహత్యాం నవమ్యాం సదా సామరూపాం
భజే శారదామ్బామజస్రం
మదంబాం
జ్వలత్కాన్తివహ్నిం జగన్మోహనాఙ్గీం
భజే మానసామ్భోజసుభ్రాన్తభృఙ్గీమ్‌
నిజస్తోత్రసంగీతనృత్యప్రభాఙ్గీమ్‌
భజే శారదామ్బామజస్రం
మదంబాం
భవామ్భోజనేత్రాజసమ్పూజ్యమానాం
లసన్మన్దహాసప్రభావక్త్రచిహ్నామ్‌
చలచ్చఞ్చలాచారుతాటఙ్కకర్ణాం
భజే శారదామ్బామజస్రం
మదంబాం

ఇతి శ్రీమత్పరమహంసపరివ్రాజకాచార్యస్య శ్రీగోవిన్దభగవత్పూజ్యపాదశిష్యస్య శ్రీమచ్ఛఙ్కరభగవతః కృతౌ శారదాభుజఙ్గప్రయాతాష్టకమ్

సరస్వతీ స్తోత్రం


ఇది అగస్త్య మహామునిచే చెప్పబడింది. ఇందులో రెండు శ్లోకాలు (యాకుందేందు, సరస్వతీ నమస్తుభ్యం) మనకు చాలా వాడుకలో ఉన్నాయి. మొత్తం స్తోత్రంలో ఇరవై శ్లోకాలు ఉన్నాయి. ఆ స్తోత్రము కింద. దాని శ్రవణం యూట్యూబ్ లంకె. ఈ రెండిటికి సాహిత్యంలో కొంత తేడా ఉంది. ఇంకొంత పరిశోధన చేసి సరిదిద్దటానికి ప్రయత్నిస్తాను.

యా కుందేందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా
యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా |
యా బ్రహ్మాచ్యుతశంకరప్రభృతిభిర్దేవైస్సదా పూజితా
సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా || ౧||
దోర్భిర్యుక్తా చతుర్భిం స్ఫటికమణినిభై రక్షమాలాం దధానా
హస్తేనైకేన పద్మం సితమపిచ శుకం పుస్తకం చాపరేణ |
భాసా కుందేందుశంఖస్ఫటికమణినిభా భాసమానాసమానా
సా మే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా || ౨||
సురాసురాసేవితపాదపంకజా కరే విరాజత్కమనీయపుస్తకా |
విరించిపత్నీ కమలాసనస్థితా సరస్వతీ నృత్యతు వాచి మే సదా || ౩||
సరస్వతీ సరసిజకేసరప్రభా తపస్వినీ సితకమలాసనప్రియా |
ఘనస్తనీ కమలవిలోలలోచనా మనస్వినీ భవతు వరప్రసాదినీ || ౪||
సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ |
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా || ౫||
సరస్వతీ నమస్తుభ్యం సర్వదేవీ నమో నమః |
శాంతరూపే శశిధరే సర్వయోగే నమో నమః || ౬||
నిత్యానందే నిరాధారే నిష్కలాయై నమో నమః |
విద్యాధరే విశాలాక్షీ శుద్ధజ్ఞానే నమో నమః || ౭||
శుద్ధస్ఫటికరూపాయై సూక్ష్మరూపే నమో నమః |
శబ్దబ్రహ్మీ చతుర్హస్తే సర్వసిద్ధ్యై  నమో నమః || ౮||
ముక్తాలంకృత సర్వాంగ్యై మూలాధారే నమో నమః |
మూలమంత్రస్వరూపాయై మూలశక్త్యై నమో నమః || ౯||
మనోమయీ మహాయోగే వాగీశ్వరీ నమో నమః |
వాగ్భ్యై వరదహస్తాయై వరదాయై నమో నమః || ౧౦||
వేదాయై వేదరూపాయై వేదాంతాయై నమో నమః |
గుణదోషవివర్జిన్యై గుణదీప్త్యై నమో నమః || ౧౧||
సర్వజ్ఞానే సదానందే సర్వరూపే నమో నమః |
సంపన్నాయై కుమార్యై చ సర్వజ్ఞ తే నమో నమః || ౧౨||
యోగానార్య ఉమాదేవ్యై యోగానందే నమో నమః |
దివ్యజ్ఞాన త్రినేత్రాయై దివ్యమూర్త్యై నమో నమః || ౧౩||
అర్ధచంద్రజటాధారీ చంద్రబింబే నమో నమః |
చంద్రాదిత్యసమే దేవీ  చంద్రబింబే నమో నమః || ౧౪||
అణురూపే మహారూపే విశ్వరూపే నమో నమః |
అణిమాద్యష్టసిద్ధాయై ఆనందాయై నమో నమః || ౧౫||
జ్ఞాన విజ్ఞాన రూపాయై జ్ఞానమూర్తే నమో నమః |
నానాశాస్త్ర స్వరూపాయై నానారూపే నమో నమః || ౧౬||
పద్మదా పద్మవంశా చ పద్మరూపే నమో నమః |
పరమేష్ఠ్యై పరామూర్త్యై నమస్తే పాపనాశినీ || ౧౭||
మహాదెవ్యై మహాకాళ్యై మహాలక్ష్మ్యై నమో నమః |
బ్రహ్మవిష్ణుశివాయై చ బ్రహ్మనార్యై నమో నమః || ౧౮||
కమలాకరపుష్పా చ కామరూపే నమో నమః |
కపాలి కర్మదీప్తాయై కర్మదాయై నమో నమః || ౧౯||
సాయం ప్రాతః పఠేన్నిత్యం షాణ్మాసాత్సిద్ధిరుచ్యతే |
చోరవ్యాఘ్రభయం నాస్తి పఠతాం శృణ్వతామపి || ౨౦||
ఇత్థం సరస్వతీస్తోత్రమగస్త్యమునివాచకమ్ |
సర్వసిద్ధికరం నృణాం సర్వపాపప్రణాశనమ్ || ౨౧||

11, అక్టోబర్ 2010, సోమవారం

లలితా పంచరత్న స్తోత్రం

శరన్నవరాత్రుల ఐదవరోజు (పంచమి) లలితాత్రిపురసుందరీ రూపంలో బెజవాడ దుర్గమ్మ కనిపిస్తుంది. శ్రీ పీఠస్థిత మేరునిలయకు ఈ పంచరత్న స్తోత్ర నీరాజనం.  జగద్గురువు ఆదిశంకరుల రచన. శ్రవణం బొంబాయి సోదరీమణుల గాత్రంలో యూట్యూబ్ సౌలభ్యంతో. దక్షిణాది స్త్రీలు అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచే ఈ దేవి కరుణామయి, వాత్స్యల్యమృతదాయిని, సర్వ మంగళ, పరమేశ్వరి.పంచాయతన విధానంలో ఆదిశంకరులు ప్రతిష్ఠించిన శక్తి పీఠాలలో లలితా రూపంలో ఎక్కువ కొలుస్తారు.

లలితాత్రిపురసుందరి 

ప్రాతః స్మరామి లలితా వదనారవిందం బింబాధరం పృథుల మౌక్తికశోభినాసం 
ఆకర్ణ దీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మితం మృగమదోజ్జ్వల ఫాలదేశం  

ప్రాతర్భజామి లలితా భుజకల్పవల్లీం రత్నాంగుళీయ లసదంగుళి పల్లవాఢ్యాం 
మాణిక్య హేమవలయాంగదశోభమానాం పుండ్రేక్షు చాపకుసుమేషు సృణీఃదధానాం  

ప్రాతర్నమామి లలితాచరణారవిందం భక్తేష్టదాననిరతం భవసింధుపోతం 
పద్మాసనాది సురనాయకపూజనీయం పద్మాంకుశధ్వజ సుదర్శనలాంఛనాఢ్యం  

ప్రాతః స్తువే పరశివాం లలితాం భవానీం త్రయ్యంతవేద్యవిభవాం కరుణానవధ్యాం 
విశ్వస్య సృష్టివిలయస్థితిహేతుభూతాం విశ్వేశ్వరీం నిగమవాంగ్మనసాతిదూరాం  

ప్రాతర్వదామి లలితే తవ పుణ్యనామ కామేశ్వరీతి కమలేతి మహేశ్వరీతి 
శ్రీశాంభవీతి జగతాం జననీ పరేతి వాగ్దేవతేతి వచసా త్రిపురేశ్వరీతి  
 
ఫలశృతి
 
యః శ్లోకపంచకమిదం లలితాంబికాయాః సౌభాగ్యదం సులలితం పఠతి ప్రభాతే 
తస్మై దదాతి లలితా ఝటితి ప్రసన్నా విద్యాం శ్రియం విమలసౌఖ్యమనంతకీర్తిం  

తాత్పర్యము: 

వికిసించిన కలువ వంటి ముఖము, ఎర్రని పెదవులు, మెరిసే ముత్యం వలె ప్రకాశిస్తున్న ముక్కు, చెవుల వరకు విప్పారిన కన్నులు, మణిమయమైన చెవి ఆభరణాలు, చక్కని చిరునవ్వు, మెరిసే, వెడల్పైన నుదురు కలిగిన ఆ లలిత దేవిని ఉదయము స్మరిస్తున్నాను.

వరాలను ప్రసాదించే తీగల వంటి చేతులు కలిగిన, రత్నాలు పొదిగిన ఉంగరము, రాళ్ళు పొదిగిన బంగారు గాజులు ధరించిన, పుష్పాలతో అలంకరించ బడిన ధనుస్సు, పాశాంకుశము అలంకారములుగా కలిగిన ఆ లలితా దేవిని ఉదయము భజిస్తున్నాను.

భక్తుల కోరికలూ తీర్చే, సంసార సాగరాన్ని దాటించే నావయైన, బ్రహ్మాది దేవతలచే పూజించబడే, పాశాంకుశము, ధ్వజము, చక్రము మొదలగు అలంకారములు కలిగిన లలితా దేవి పాదపద్మములను ఉదయము పూజిస్తున్నాను.

పరమశివుని శక్తియై, దుష్టుల మదాన్ని అణచే, వేదాలు మరియు ఉపనిషత్తులచే వర్ణించబడి, శుద్ధయై, శుభయై, కరుణ కురిపించే, సృష్టి, స్థితి, లయలకు కారణయై, జగత్తుకే రాణిగా, మనస్సుకు, మాటలకు అందని లలితాదేవిని  ఉదయము స్తుతిస్తున్నాను.

కామేశ్వరి, కమల, మహేశ్వరి, శాంభవి మొదలు ఎన్నో పుణ్య నామములు కలిగిన, జగజ్జని యైన, పదములు, భాషకు మూలమైన, త్రిపురేశ్వరిగా ఉన్న లలితా దేవి నామములను ఉదయము ఉచ్చరిస్తున్నాను.

ఫలశృతి:

సులభంగా ప్రసన్నమయ్యే లలితాదేవిని ఉదయము ఈ ఐదు శ్లోకాలతో స్తుతించిన వారికి విద్య, శుభము, సుఖము, అనంతమైన కీర్తి కలుగుతాయి.

10, అక్టోబర్ 2010, ఆదివారం

దేవీ అశ్వధాటీ (కాళిదాస కృత దేవీ దశశ్లోకి)

కాళిదాసు అశ్వ ధాటి (గుఱ్ఱము పరుగెడుతున్నపుడు వచ్చే శబ్దంలా ధ్వనించే ఛందం) ఛందంలో రాసిన అద్భుతమైన అంబా స్తుతి. దీనినే అశ్వధాటి స్తోత్రం అని కూడా అంటారు. కొంతమంది దీనిని ఆదిశంకరులు రచించారు అని వాదిస్తారు. కాని ఎక్కడా, ఆదిశంకరుల రచనలో కనిపించే ఛందము, పదాలు, ఆధ్యాత్మిక ఔన్నత్యము ఇందులో కనిపించవు. ఇది తప్పకుండా ఒక కవియొక్క వర్ణనే అని నా భావన. ఎవరు రాస్తేనేమి? అమ్మవారిని స్తుతించటానికి ఇంకొక అవకాశం..

మేళ్ళచెర్వు భానుప్రసాదరావు గారు దీని గురించి అద్భుతమైన వ్యాఖ్యానం రాశారు. ఇది ఉచితంగా ఈ లంకెలో చదవండి. ఆయన రాసిన ఈ వ్యాఖ్యానం లో వివరాలు అన్నీ ఉన్నాయి. మాడుగుల నాగఫణిశర్మ గారి గళంలో వినండి . మాడుగుల వారి స్తోత్రానికి, దీనికి, వేరే మూలాలకు సాహిత్యంలో కొంత తేడా ఉంది కాని,  మేళ్ళచెర్వు వారి సాహిత్యాన్నే నేను ప్రచురిస్తున్నాను.

శైల పుత్రి

చేటీ భవన్నిఖిల ఖేటీ కదంబవన వాటీషు నాకి పటలీ
కోటీర చారుతర కోటీ మణీకిరణ కోటీ కరంబిత పదా |
పాటీరగంధి కుచశాటీ కవిత్వ పరిపాటీమగాధిప సుతా
ఘోటీఖురాదధిక ధాటీముదార ముఖ వీటీరసేన తనుతామ్ || ౧

ద్వైపాయన ప్రభృతి శాపాయుధ త్రిదివ సోపాన ధూళి చరణా
పాపాపహ స్వమను జాపానులీన జన తాపాపనోద నిపుణా |
నీపాలయా సురభి ధూపాలకా దురితకూపాదుదన్చయతుమామ్
రూపాధికా శిఖరి భూపాల వంశమణి దీపాయితా భగవతీ || ౨

యాళీభి రాత్మతనుతాలీనకృత్ప్రియక పాళీషు ఖేలతి భవా
వ్యాళీ నకుల్యసిత చూళీ భరా చరణ ధూళీ లసన్మణిగణా |
యాళీ భృతి శ్రవసి తాళీ  దళం వహతి యాళీక శోభి తిలకా
సాళీ కరోతు మమ కాళీ మనః స్వపద నాళీక సేవన విధౌ || ౩

బాలామృతాంశు నిభ ఫాలామనా గరుణ చేలా నితంబ ఫలకే
కోలాహల క్షపిత కాలామరాకుశల కీలాల శోషణ రవిః |
స్థూలాకుచే జలద నీలాకచే కలిత వీలా కదంబ విపినే
శూలాయుధ ప్రణతి శీలా దధాతు హృది శైలాధి రాజ తనయా || ౪

కంబావతీవ సవిడంబా గళేన నవ తుంబాభ వీణ సవిధా
బింబాధరా వినత శంబాయుధాది నికురుంబా కదంబ విపినే |
అంబా కురంగ మదజంబాల రోచి రిహ లంబాలకా దిశతు మే
శం బాహులేయ శశి బింబాభి రామ ముఖ సంబాధితా స్తన భరా || ౫

దాసాయమాన సుమహాసా కదంబవన వాసా కుసుంభ సుమనో
వాసా విపంచి కృత రాసా విధూత మధు మాసారవింద మధురా |
కాసార సూన తతి భాసాభిరామ తను రాసార శీత కరుణా
నాసా మణి ప్రవర భాసా శివా తిమిర మాసాయే దుపరతిమ్ || ౬

న్యంకాకరే వపుషి కంకాళ రక్త పుషి కంకాది పక్షి విషయే
త్వం కామనా మయసి కిం కారణం హృదయ పంకారి మే హి గిరిజామ్ |
శంకాశిలా నిశిత టంకాయమాన పద సంకాశమాన సుమనో
ఝంకారి భృంగతతి మంకానుపేత శశి సంకాశ వక్త్ర కమలామ్ || ౭

జంభారి కుంభి పృథు కుంభాపహాసి కుచ సంభావ్య హార లతికా
రంభా కరీంద్ర కర దంభాపహోరుగతి డింభానురంజిత పదా |
శంభా ఉదార పరిరంభాంకురత్ పులక దంభానురాగ పిశునా
శం భాసురాభరణ గుంభా సదా దిశతు శుంభాసుర ప్రహరణా || ౮

దాక్షాయణీ దనుజ శిక్షా విధౌ వికృత దీక్షా మనోహర గుణా
భిక్షాశినో నటన వీక్షా వినోద ముఖి దక్షాధ్వర ప్రహరణా |
వీక్షాం విధేహి మయి దక్షా స్వకీయ జన పక్షా విపక్ష విముఖీ
యక్షేశ సేవిత నిరాక్షేప శక్తి జయ లక్షావధాన కలనా || ౯

వందారు లోక వర సంధాయినీ విమల కుందావదాత రదనా
బృందారు బృంద మణి బృందారవింద మకరందాభిషిక్త చరణా |
మందానిలా కలిత మందార దామభిరమందాభిరామ మకుటా
మందాకినీ జవన భిందాన వాచమరవిందాననా దిశతు మే || ౧౦

యత్రాశయో లగతి తత్రాగజా భవతు కుత్రాపి నిస్తుల శుకా
సుత్రామ కాల ముఖ సత్రాసకప్రకర సుత్రాణ కారి చరణా |
ఛత్రానిలాతిరయ పత్త్రాభిభిరామ గుణ మిత్రామరీ సమ వధూః
కు త్రాసహీన మణి చిత్రాకృతి స్ఫురిత పుత్రాది దాన నిపుణా || ౧౧

కూలాతిగామి భయ తూలావళిజ్వలనకీలా నిజస్తుతి విధా
కోలాహలక్షపిత కాలామరీ కుశల కీలాల పోషణ రతా |
స్థూలాకుచే జలద నీలాకచే కలిత లీలా కదంబ విపినే
శూలాయుధ ప్రణతి శీలా విభాతు హృది శైలాధిరాజ తనయా || ౧౨

ఇన్ధాన కీర మణిబన్ధా భవే హృదయబన్ధా వతీవ రసికా
సన్ధావతీ భువన సన్ధారణే ప్యమృత సిన్ధావుదార నిలయా |
గన్ధానుభావ ముహురన్ధాలి పీత కచ బన్ధా సమర్పయతు మే
శం ధామ భానుమపి రున్ధాన మాశు పద సన్ధాన మప్యనుగతా || ౧౩

దేవీ సూక్తం


దుర్గా సప్తశతి ఉపసంహారంలో భాగం ఈ దేవీ సూక్తం.  ఉత్తరభారత దేశంలో దుర్గాపూజలో  చాలా ప్రాచుర్యం పొందిన ఈ సూక్తం ముప్ఫై శ్లోకాలుగా చెప్పబడింది. ఈ సప్తశతి మార్కండేయ పురాణంలో చెప్పబడింది.  ఈ దుర్గాసూక్తం అత్యంత మహిమాన్వితమైనదిగా నుడవబడింది. దీనిని పఠించి ఆ దేవి కృపా కటాక్షాన్ని పొందుదాం. అనురాధా పోడ్వాల్ చాలా భక్తితో పాడిన యూట్యూబ్ లంకె.

(నవరాత్రులలో మొదటిరోజున అమ్మవారు కవచాలంకృత దుర్గగా విజయవాడలో అలంకరించబడింది. నేను పొరపాటున అన్నపూర్ణ అని రాసాను. అన్నపూర్ణ అలంకారము రేపు. కాబట్టి రేపటి రోజు (నాలుగవ రోజు తదియ) వ్యాసం కింద ఈ కింద దేవీ సూక్తం).

నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః
నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాః స్మతామ్

రౌద్రాయై నమో నిత్యాయై గౌర్యై ధాత్ర్యై నమో నమః
జ్యోత్స్నాయై చేందురూపిణ్యై సుఖాయై సతతం నమః

కల్యాణ్యై ప్రణతాం వృద్ధ్యై సిద్ధ్యై కుర్మో నమో నమః
నైరృత్యై భూభృతాం లక్ష్మ్యై శర్వాణ్యై తే నమో నమః

దుర్గాయై దుర్గపారాయై సారాయై సర్వకారిణ్యై
ఖ్యాత్యై తథైవ కృష్ణాయై ధూమ్రాయై సతతం నమః

అతిసౌమ్యాతిరౌద్రాయై నతాస్తస్యై నమో నమః
నమో జగత్ప్రతిష్ఠాయై దేవ్యై కృత్యై నమో నమః

యా దేవీ సర్వ భూతేషు విష్ణుమాయేతి శబ్దితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

యా దేవీ సర్వ భూతేషు చేతనేత్యభిధీయతే
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

యా దేవీ సర్వ భూతేషు బుద్ధిరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

యా దేవీ సర్వ భూతేషు నిద్రారూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

యా దేవీ సర్వ భూతేషు క్షుధారూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

యా దేవీ సర్వ భూతేషు ఛాయారూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

యా దేవీ సర్వ భూతేషు శక్తిరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

యా దేవీ సర్వ భూతేషు తృష్ణారూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

యా దేవీ సర్వ భూతేషు క్షాంతిరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

యా దేవీ సర్వ భూతేషు జాతిరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

యా దేవీ సర్వ భూతేషు లజ్జారూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

యా దేవీ సర్వ భూతేషు శాంతిరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

యా దేవీ సర్వ భూతేషు శ్రద్ధారూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

యా దేవీ సర్వ భూతేషు కాంతిరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

యా దేవీ సర్వ భూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

యా దేవీ సర్వ భూతేషు వృత్తిరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

యా దేవీ సర్వ భూతేషు స్మృతిరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

యా దేవీ సర్వ భూతేషు దయారూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

యా దేవీ సర్వ భూతేషు తుష్టిరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

యా దేవీ సర్వ భూతేషు మాతృరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

యా దేవీ సర్వ భూతేషు భ్రాంతిరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

ఇంద్రియాణాం అధిష్ఠాత్రీ భూతానాం చాఖిలేశు యా
భూతేషు సతతం తస్యై వ్యాప్తిదేవ్యై నమో నమః

చితిరూపేణ యా కృత్స్నమేతద్వ్యాప్య స్థితా జగత్
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

స్తుతాసురైః పూర్వమభీష్టసంశ్రయా
తథా సురేంద్రేణ దినేషు సేవితా

కరోతు సా నః శుభహేతురీశ్వరీ
శుభాని భద్రాణ్యభిహంతు చాపదః

యా సాంప్రతం చోద్ధతదైత్యతాపితైః
అస్మాభిరీశా చ సురైర్నమస్యతే

యా చ స్మృతా తత్క్షణమేవ హంతి నః
సర్వాపదో భక్తి వినమ్రమూర్తిభిః

9, అక్టోబర్ 2010, శనివారం

గాయత్ర్యష్టకం, మంత్ర సారం

శరన్నవరాత్రుల మూడవ నాడు (తదియ) గాయత్రి అలంకారములో అలరారే ఆ ఆదిపరాశక్తిని  స్తుతిస్తూ ఆదిశంకరులు రచించిన గాయత్ర్యష్టకం, తాత్పర్యము మీకోసం. ఈ సందర్భంగా నేను ఇదివరకు ప్రచురించిన గాయత్రీ మంత్ర సంబంధమైన వ్యాసం మళ్లీ ఈ వ్యాసంలో చివరన పొందుపరుస్తున్నాను.

గాయత్ర్యష్టకం



విశ్వామిత్ర తపఃఫలాం ప్రియతరాం విప్రాలిసంసేవితాం
నిత్యానిత్య వివేకదాం స్మితముఖీం ఖండేందు భూషోజ్జ్వలాం
తాంబూలారుణ భాసమాన వదనాం మార్తాండమధ్యస్థితాం
గాయత్రీం హరివల్లభాం త్రినయనాం ధ్యాయామి పంచాననాం

జాతీపంకజకేతకీకువలయైః సంపూజితాంఘ్రిద్వయా
తత్వార్థాత్మికవర్ణపంకిసహితా తత్వార్థబుద్ధిప్రదాం
ప్రాణాయామపరాయణైర్బుధజనైః సంసేవ్యమానాం శివాం
గాయత్రీం హరివల్లభాం త్రినయనాం ధ్యాయామి పంచాననాం

మంజీరధ్వనిభిః సమస్తజగతాం మంజుత్వసంవర్ధనీం
విప్రప్రేంఖితవారివారితమహారక్షోగణాం మృణ్మయీం
జప్తుః పాపహరాం జపాకుసుమనిభాం హంసేన సంశోభితాం
గాయత్రీం హరివల్లభాం త్రినయనాం ధ్యాయామి పంచాననాం

కాంచీచేల విభూషితాం శివమయీం మాలార్ధమాలాదికాన్
బిభ్రాణాం పరమేశ్వరీం శరణదాం మోహాంధబుద్ధిచ్ఛిదాం
భూరాదిత్రిపురాం త్రిలోకజననీమధ్యాత్మశాఖానుతాం
గాయత్రీం హరివల్లభాం త్రినయనాం ధ్యాయామి పంచాననాం

ధ్యాతుర్గర్భకృశానుతాపహరణాం సామాత్మికాం సామగాం
సాయంకాల సుసేవితాం స్వరమాయీం దూర్వాదళశ్యామలాం
మాతుర్దాస్యవిలోచనైకమతిమత్ఖేటీంద్రసంరాజితాం
గాయత్రీం హరివల్లభాం త్రినయనాం ధ్యాయామి పంచాననాం

సంధ్యారాగవిచిత్రవస్త్రవిలసద్విప్రోత్తమైః సేవితాం
తారాహీరసుమాలికాం సువిలసద్రత్నేందుకుంభాంతరాం
రాకాచంద్రముఖీం రమాపతినుతాం శంఖాదిభాస్వత్కరాం
గాయత్రీం హరివల్లభాం త్రినయనాం ధ్యాయామి పంచాననాం

వేణీభూషితమాలకధ్వనికరైర్భృంగైః సదాశోభితాం
తత్వజ్ఞానరసాయనజ్ఞరసనాసౌధద్భ్రమద్భ్రామరీం
నాసాలంకృతమౌక్తికేందుకిరణైః సాయంతమశ్ఛేదినీం
గాయత్రీం హరివల్లభాం త్రినయనాం ధ్యాయామి పంచాననాం

పాదాబ్జాంతరరేణుకుంకుమలసత్ఫాలధ్యురామావృతాం
రంభానాట్యవిలోకనైకరసికాం వేదాంతబుద్ధిప్రదాం
వీణావేణుమృదంగకాహలరవాన్ దేవైః కృతాంఛృణ్వతీం
గాయత్రీం హరివల్లభాం త్రినయనాం ధ్యాయామి పంచాననాం


ఫలశ్రుతిః
 

హత్యాపానసువర్ణతస్కరగుర్వంగనాసంగమాన్
దోషాన్ఛైలసమాన్ పురందరసమాః సంచ్ఛింధ్య సూర్యోపమాః
గాయత్రీ శృతిమాతురేకమనసా సంధ్యాసు యే భూసురా
జప్త్వా యాంతి పరాం గతిం మునిమిమం దేవ్యాః పరం వైదికాః

ఇతి శ్రీమత్పరమహంసపరివ్రాజకాచార్య
శ్రీమచ్ఛంకరాచార్యవిరచితం గాయత్ర్యష్టకం సంపూర్ణం


తాత్పర్యం: 

విశ్వామిత్రుని తపఃఫలముగా వచ్చి, బ్రాహ్మణులు, ఋషులచే పూజింబడి, అనంతమైన, నిత్యమైన వివేకాన్ని ఇచ్చే, నెలవంకను ఆభరణముగా కలిగి శోభిల్లుతున్న, ఎర్రని వదనముతో భాసిల్లుతున్న, సూర్యుని మధ్యలో నివసిస్తున్న, శ్రీహరికి ప్రియమైనది యైన, మూడు నేత్రములు, ఐదు ముఖములతోనున్న గాయత్రీదేవిని ధ్యానిస్తున్నాను.

మల్లెలు, కలువలు, మొగలి పూలమాలలతో శోభిల్లు పాదములు కలిగిన, తత్వార్థజ్ఞానాన్ని సంకేతించే బీజాక్షరాలు కలిగినది, ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించే, ప్రాణాయామములో నిష్ణాతులైన పండితులచే పూజించబడే, ఎల్లప్పుడు శుభాన్ని కలిగించే, శ్రీహరికి ప్రియమైనది యైన, మూడు నేత్రములు, ఐదు ముఖములతోనున్న గాయత్రీదేవిని ధ్యానిస్తున్నాను.

కాలియందెల మృదువైన ధ్వనితో సమస్త జగత్తులో మృదుత్వాన్ని పెంచే, బ్రాహ్మణుల అర్పించిన అర్ఘ్యాలు,తర్పణాలతో రాక్షసులను అణచే, జపం చేసే వారి పాపాలను తొలగించే, ఎర్రని శరీర ఛాయ కలిగి, హంసవాహినియై, శ్రీహరికి ప్రియమైనది యైన, మూడు నేత్రములు, ఐదు ముఖములతోనున్న గాయత్రీదేవిని ధ్యానిస్తున్నాను.

పట్టువస్త్రములు ధరించి,  పూల మాలలతో అలంకరించబడినదై, అనంతమైన శుభాన్ని కలిగించే, శరణును ప్రసాదించే, బుద్ధినుంచి మోహాన్ని విడగొట్టే, భూర్భువస్సువయై (దీని వివరణకు కింద గాయత్రీ మంత్రసారం చదవండి),  మూడులోకాలకు మాతయై, ఆధ్యాత్మికశాఖలచే నుతింపబడే, శ్రీహరికి ప్రియమైనది యైన, మూడు నేత్రములు, ఐదు ముఖములతోనున్న గాయత్రీదేవిని ధ్యానిస్తున్నాను.

తనను ధ్యానము చేసేవారి తాపాగ్ని నాశనము చేసే, ఎల్లప్పుడు సంయమనము కలిగి, శాంతమూర్తియై, సుస్వరయై, దూరముగా ఉన్న దర్భ (గడ్డిపోచ) వలె నల్లని ఛాయకలదై, శ్రీహరికి ప్రియమైనది యైన, మూడు నేత్రములు, ఐదు ముఖములతోనున్న గాయత్రీదేవిని ధ్యానిస్తున్నాను.

సాయంకాల సమయంలో కాషాయవస్త్రధారిణియై బ్రాహ్మణులచే పూజింబడి, నక్షత్రాలవలె మెరుస్తున్న వజ్రహారములు ధరించిన, స్తనముల మధ్య చంద్రునివలె ప్రకాశించుచున్న రత్నాభరణములు కలిగిన, పూర్ణచంద్రునివలె ప్రకాశిస్తున్న ముఖము కలదై, రామునిచే పూజింపబడి, శంఖము మొదలగు హస్తాలంకారములతో, శ్రీహరికి ప్రియమైనది యైన, మూడు నేత్రములు, ఐదు ముఖములతోనున్న గాయత్రీదేవిని ధ్యానిస్తున్నాను.

చుట్టూ భ్రమరములు తిరుగుతు ఉన్న పూలమాలలు కేశములలో అలంకరించబడినదై, భ్రమరము వలె ధ్వని చేయుచు, నాలుకయందు తత్వజ్ఞానమనే రసము కలిగి, నాసికాభరణమునుండి వెలువడే ప్రకాశముతో చీకటిని ఛేదించే, శ్రీహరికి ప్రియమైనది యైన, మూడు నేత్రములు, ఐదు ముఖములతోనున్న గాయత్రీదేవిని ధ్యానిస్తున్నాను.

పదకమలములయందు ఉన్న కుంకుమ, పుప్పొడి రేణువులనుండి వెలువడే కిరణాలతో ప్రకాశిస్తున్న, రంభ నృత్యాన్ని తిలకిస్తూ ఆనందించే, వేదాంతజ్ఞానాన్ని ప్రసాదిస్తూ, వీణ, వేణువు, మృదంగాది వాద్యముల నాదమును వింటూ, శ్రీహరికి ప్రియమైనది యైన, మూడు నేత్రములు, ఐదు ముఖములతోనున్న గాయత్రీదేవిని ధ్యానిస్తున్నాను.

ఫలశ్రుతి:
హత్య, మధిరాపానము, బంగారం దొంగిలించటం, గురుపత్నిని మోహించటం వంటి మహాపాపాలను నాశనం చేసే,  ఇంద్రుడు, సూర్యులకు సమమైన మంత్రమును సాయంకాల సమయమున బ్రాహ్మణులు జపించుటవలన వారి ఆత్మలకు అత్యుత్తమైన వైదిక గతి కలుగుతుంది.

గాయత్రీ మంత్రం:

ఓం భూర్భువస్సువః |
తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి |
ధియో యో నః ప్రచోదయాత్ |

తాత్పర్యం: ప్రణవ మంత్రంగా, భూః భువః సువః అనే మూడు వ్యాహృతులుగా ఉంటూ ఎవరు మన బుద్ధిని ప్రేరేపిస్తారో, సమస్తాన్ని సృష్టించే ఆ జ్యోతిర్మయ రూపాన్ని ధ్యానిద్దాం.


గాయత్రి మంత్రంలో ఉన్న మూడు భాగాలు:

1. మొదటి భాగం ప్రణవ మంత్రమైన ఓం.
2. రెండవ భాగం ప్రణవ మంత్రాన్ని విప్పి చెప్పే భూః, భువః, సువః అనే మూడు వ్యాహృతాలు. ఇవి స్థూల స్థితిలో భూమి, పితృలోకం, దేవలోకాన్ని సూచిస్తాయి. సూక్ష్మ స్థితిలో మన చేతన యొక్క మూడు స్థితులు - మనసు, శరీరం, ప్రాణం అనే మూడు స్థితులలోను పనిచేసి మన జీవితాన్ని పరిపోషణ గావిస్తాయి.
3. ఇక మూడో భాగం తత్...ప్రచోదయాత్ అనేది సావిత్రీ మంత్రంగా చెప్పబడింది.

మొత్తం మీద, ప్రణవం, వ్యాహృతి, సావిత్రి - ఈ మూడు కలిసిందే గాయత్రి. గాయాతం త్రాయతే ఇతి గాయత్రి - అంటే, జపించేవారిని తరింపజేస్తుంది కాబట్టి ఇది గాయత్రీ అని పేరు పొందింది. ఋగ్వేదంలో చెప్పబడింది.

8, అక్టోబర్ 2010, శుక్రవారం

దేవీ నవరత్నమాలికా స్తోత్రం

ఆదిశంకరులు ఆ పరదేవతయైన మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపిణియైన లలితా త్రిపురసుందరి రూపాన్ని దర్శించి తాదాత్యం చెందినప్పుడు,  ఆ శక్తి ఆయన వాక్కు రూపంలో ఇలా అద్భుతమైన ఛందంలో తొమ్మిది శ్లోకాలుగా వెలువడింది. పదాలు, వర్ణన అన్నీ ప్రతి శ్లోకంలో ఆయన పొందిన అనుభూతిలోని ఔన్నత్యాన్ని తెలుపుతాయి. బొంబాయి సోదరీమణులు సరోజ, లలిత చాలా శ్రావ్యంగా రాగమాలికగా ఆలపించారు ఈ నవరత్నమాలికా స్తోత్రాన్ని.  యూట్యూబ్ లంకె.


హారనూపుర కిరీటకుండల విభూషితావయవ శోభినీం
కారణేశవరమౌళి కోటిపరికల్ప్యమాన పదపీఠికాం
కాలకాలఫణిపాశబాణ ధనురంకుశామరుణమేఖలాం
ఫాలభూతిలకలోచనాం మనసి భావయామి పరదేవతాం

గంధసార ఘనసార చారు వననాగవల్లి రసవాసినీం
సాంధ్యరాగమధురాధరాభరణ సుందరాననశుచిస్మితాం
మంధరాయతవిలోచనామమలబాలచంద్రకృతశేఖరీం
ఇందిరారమణ సోదరీం మనసి భావయామి పరదేవతాం

స్మేరచారుముఖమండలాం విమలగండలంబిమణిమండలాం
హారదామపరిశోభమాన కుచభార భీరుతనుమధ్యమాం
వీరగర్వహరనూపురాం వివిధ కారణేశవరపీఠికాం
మారవైరి సహచారిణీం మనసి భావయామి పరదేవతాం

భూరిభారధరకుండలీంద్ర మణిబద్ధభూవలయ పీఠికాం
వారిరాశి మణిమేఖలావలయ వహ్నిమండల శరీరిణీం
వారిసారవహకుండలాం గగన శేఖరీం చ పరమాత్మికాం
చారుచంద్ర రవిలోచనాం మనసి భావయామి పరదేవతాం

కుండల త్రివిధకోణమండలవిహార షడ్దళసముల్లసత్
పుండరీక ముఖభేదినీం తరుణ చండభానుతటిదుజ్జ్వలాం
మండలేందుపరివాహితామృత తరంగిణీమరుణరూపిణీం
మండలాంతమణిదీపికాం మనసి భావయామి పరదేవతాం

వారణాననమయూరవాహముఖదాహవారణపయోధరాం
చారణాదిసురసుందరీచికురశేఖరీకృతపదాంబుజాం
కారణాధిపతి పంచకప్రకృతికారణ ప్రథమమాతృకాం
వారణాంతముఖపారణాం మనసి భావయామి పరదేవతాం

పద్మకాంతిపదపాణిపల్లవపయోధరాననసరోరుహాం
పద్మరాగ మణిమేఖలావలయనీవిశోభితనిలంబినీం
పద్మసంభవసదాశివాంతమయపంచరత్న పదపీఠికాం
పద్మినీం ప్రణవరూపిణీం మనసి భావయామి పరదేవతాం

ఆగమ ప్రణవపీఠికామమలవర్ణ మంగళ శరీరిణీం
ఆగమావయవశోభినీమఖిల వేదసార కృతశేఖరీం
మూలమంత్రముఖమండలాం ముదిత నాదబిందు నవయౌవనాం
మాతృకాం త్రిపురసుందరీం మనసి భావయామి పరదేవతాం

కాళికా తిమిరకుంతలాంతఘన భృంగమంగళ విరాజినీం
చూలికా శిఖరమాలికావలయ మల్లికా సురభిసౌరభాం
బాలికా మధురగండమండల మనోహరానన సరోరుహాం
కాళికామఖిల నాయికాం మనసి భావయామి పరదేవతాం

నిత్యమేవ నియమేన జల్పతాం
భుక్తిముక్తి ఫలదామభీష్టదాం
శంకరేణ రచితాం సదా జపేన్
నామరత్న నవరత్నమాలికాం

త్రిపురసుందరీ అష్టకం

శరన్నవరాత్రుల రెండవ రోజున (ఆశ్వయుజ శుద్ధ విదియ) నాడు బాలత్రిపుర సుందరీ అలంకారంలో కనిపించే ఆ దేవిని స్తుతిస్తూ ఆదిశంకరులు రచించిన త్రిపురసుందరీ అష్టకం. బొంబాయి సోదరీమణులు సరోజ, లలిత చాలా మనోజ్ఞంగా పాడారు. యూట్యూబ్ లంకె

బాలాత్రిపురసుందరి 

కదంబవనచారిణీం మునికదంబకాదంబినీం
నితంబజిత భూధరాం సురనితంబినీసేవితాం
నవాంబురుహలోచనాం అభినవాంబుధశ్యామలాం
త్రిలోచనకుటుంబినీం త్రిపురసుందరీమాశ్రయే

కదంబవనవాసినీం కనకవల్లకీ ధారిణీం
మహార్హమణిహారిణీం ముఖసముల్లసద్వారుణీం
దయావిభవకారిణీం విశదలోచనీం చారిణీం
త్రిలోచనకుటుంబినీం త్రిపురసుందరీమాశ్రయే

కదంబవనశాలయా కుచభరోల్లసన్మాలయా
కుచోపమితశైలయా గురుకృపాలసద్వేలయా
మదారుణకపోలయా మధురగీతవాచాలయా
కయాపి ఘననీలయా కవచితావయం లీలయా

కదంబవనమధ్యగాం కనకమండలోపస్థితాం
షడంబురుహవాసినీం సతతసిద్ధసౌదామినీం
విడంబితజపారుచిం వికచచంద్రచూడామణిం
త్రిలోచనకుటుంబినీం త్రిపురసుందరీమాశ్రయే

కుచాంచితవిపంచికాం కుటిలకుంతలాలంకృతాం
కుశేశయన వాసినీం కుటిలచిత్తవిద్వేషిణీం
మదారుణవిలోచనాం మనసిజారిసమ్మోహినీం
మతంగమునికన్యకాం మధురభాషిణీమాశ్రయే

స్మరప్రథమపుష్పిణీం రుధిరబిందునీలాంబరాం
గృహీతమధుపాత్రికాం మధువిధూర్ణనేత్రాంచలాం
ఘనస్తనభరోన్నతాం గలితచూలికాం శ్యామలాం
త్రిలోచనకుటుంబినీం త్రిపురసుందరీమాశ్రయే

సకుంకుమవిలేపనామలకచుంబికస్తూరికాం
సమందహసితేక్షణాం సశరచాపపాశాంకుశాం
అశేషజనమోహినీం అరుణమాల్య భూషాంబరాం
జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరామ్యంబికాం

పురందరపురంధ్రికాం చికురబంధసైరంధ్రికాం
పితామహపతివ్రతాం పటుపటీరచర్చారతాం
ముకుందరమణీమణీలసదలంక్రియాకారిణీం
భజామి భువనాంబికాం సురవధూటికాచేటికాం

7, అక్టోబర్ 2010, గురువారం

అన్నపూర్ణాష్టకం

రేపు శరన్నవరాత్రులు ఆరంభం. పాడ్యమి నాటి అన్నపూర్ణ అలంకరణకు ఆదిశంకరుల నోట వెలువడిన అన్నపూర్ణాష్టకం. సాహిత్యం రెండు మూడు రకాలుగా దొరికింది. ఏది సరైనది అన్నది నాకు అర్థం కాలేదు. అన్నీ ఛందస్సు, భక్తి పరంగా సరిగ్గానే ఉన్న, ఈ కింద ఉన్న ప్రచురణ నాకు నచ్చింది. యూట్యూబ్ లంకె.



నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ
నిర్ధూతాఖిలఘోరపావనకరీ ప్రత్యక్షమాహేశ్వరీ
ప్రాలేయాచలవంశపావనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ

నానారత్నవిచిత్రభూషణకరీ హేమాంబరాడంబరీ
ముక్తాహారవిలంబమాన విలసత్ వక్షోజకుంభాంతరీ
కాశ్మీరాగరువాసితా రుచికరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ

యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మార్థనిష్ఠాకరీ
చంద్రార్కానలభాసమానలహరీ త్రైలోక్యరక్షాకరీ
సర్వైశ్వర్య కరీ తపః ఫలకరీ  కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ

కైలాసాచలకంధరాలయకరీ గౌరీ ఉమా శాంకరీ
కౌమారీ నిగమార్థగోచరకరీ ఓంకారబీజాక్షరీ
మోక్షద్వారకవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ

దృశ్యాదృశ్య విభూతి పావనకరీ బ్రహ్మాండభాండోదరీ
లీలానాటకసూత్ర ఖేలనకరీ విజ్ఞానదీపాంకురీ
శ్రీవిశ్వేశమనః ప్రసాదనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ

ఉర్వీ సర్వజనేశ్వరీ భగవతీ మాత కృపాసాగరీ
వేణీనీలసమానకుంతలధరీ నిత్యాన్నదానేశ్వరీ
సర్వానందకరీ సదాశుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ

ఆదిక్షాన్తసమస్తవర్ణనకరీ శంభోస్త్రిభావాకరీ
కాశ్మీరా త్రిజలేశ్వరీ త్రిలహరీ నిత్యాంకురా శర్వరీ
కామాకాంక్షకరీ జనోదయకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ

దెవీ సర్వవిచిత్రరత్నరచితా దాక్షాయణీ సుందరీ
వామే స్వాదుపయోధరా ప్రియకరీ సౌభాగ్య మాహేశ్వరీ
భక్తాభీష్టకరీ సదాశుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ

చంద్రార్కానలకోటికోటిసదృశా చంద్రాంశుబింబాధరీ
చంద్రార్కాగ్నిసమానకుండలధరీ చంద్రార్కవర్ణేశ్వరీ
మాలాపుస్తకపాశాంకుశధరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ

క్షత్రత్రాణకరీ మహాభయహరీ మాతా కృపాసాగరీ
సాక్షాన్మోక్షకరీ సదా శివకరీ విశ్వేశ్వరీ శ్రీధరీ
దక్షాక్రంధకరీ నిరామయకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ

అన్నపూర్ణే సదాపూర్ణే శంకరప్రాణవల్లభే
జ్ఞానవైరాగ్యసిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి

మాతా మే పార్వతీ దేవీ పితా దేవో మహేశ్వరః
బాంధవాః శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం